నా గురించి
మొత్తం అంతా ఇక్కడే చెప్పేస్తే ఏం బాగుంటుంది చెప్పండి! అయినా సరే ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి నా గురించి కొంచెం...
రాయాలి అన్న తపన వున్నా ఎప్పుడో చిన్నతనంలో రాసిన కవితలు, కథలు, కథనాలు, నాటికలు తప్పితే మళ్ళీ రాసిన పాపాన పోలేదు. "అయినా వెధవది ఎప్పుడూ పనులేనా, మడిసన్నాక కూసింత కలాపోసన వుండాలి", అని బాపు-రమణ గార్లు ముత్యాలముగ్గు చిత్రంలో చెప్పారు కదా (రావుగోపాలరావు గారి ద్వారా)! ఆ కుతూహలం కొద్దీ మళ్ళి రాస్తున్నా. తప్పులు వుంటే క్షమించొద్దు! నిలదీయండి, సరిదిద్దండి, ప్రొత్సహించండి.
చివరిగా ఒక్కమాట, మీ విలువైన అభిప్రాయాలు, సలహాలు, సూచనలు తెలుపగలరని మనవి.
ఇంక చదువుకోండి నా కథలు, కవితలు, పాటలు, పల్లవులు,... వగైరా వగైరా
ప్రేమతో మీ..
దిలీప్