Tuesday, 27 March 2007

Life's like that..so keep smiling always with no worries :) :) :)

Telugu

IMAGINATION IS ALWAYS BETTER THEN REALITY
... ఒక అమ్మాయి చెప్పింది! అదే బాగుందిలేండి! సో నా గురించి ఊహించేస్కోండి; హీరో అనుకున్నా సరే; విలన్ అనుకున్నా సరే; కామెడీ - ట్రాజెడీ ఐనా సరే.. ఎలా ఐనా ఓ.కే.. నో వర్రీస్!

Everything happens for a Reason.. అది ఎందుకు, ఎప్పుడు, ఎలా, ఎవరివల్ల అనేది తెలియదు కదా..?! ఐనా తెలిస్తే థ్రిల్ ఏం వుంటుంది.. కాని ఏం జరిగినా మనల్ని ప్రేమించే వాళ్ళు మనతో వుంటారు అలాగే మనం ప్రేమించే వాళ్ళు మనకి మళ్ళీ దొరుకుతారు.. పాత జ్ఞాపకాల్ని పదిలపరచుకుంటూ.. కొత్త అనుభవాలని రుచి చూస్తూ గడిపెయ్యటమే జీవితం!ఇవన్నీ చెప్పినంత తేలికగా వుండవు అనుకోండి. కానీ జరిగిపోయిన దాన్ని మార్చలేము, జరగవలసిన దాన్ని ఆపలేము. కబట్టి, జరిగిపోయిన దానికి టాటా చెప్పి.. జరగాల్సిన వాటికి ఆహ్వానం పలికితే అయిపొతుంది కదా!!

ఇప్పటికే పెద్దోళ్ళు చదువు చదువు అని సగం బుర్ర అంతా కుళ్ళిపోయేలా చేసారు. మిగతా సగం మనం అనవసరమైన విషయాలన్ని ఆలొచించి చించి పాడు చెస్కుంటున్నాం. కాని ఆలొచనల్ని ఆపటం మన వల్ల కాదు.. కాబట్టీ ఎప్పటిలాగే ఆలోచించాలి- ఆనందించాలి. కలలు కనాలి- అవి నిజం చేస్కోవటానికి ప్రయత్నించాలి! నిజం కాకపోతే ఏడ్చెయ్యాలి (ఎవరికీ తెలియకుండా ఐనా సరే - మరి నిజమైతే ఎగిరి గంతుల్లెయ్యాలి.. అలా అలా జీవితం ఎలాగో అయిపోతుంది కదా!

అబ్బా ఎంటి చాల ఫిలాసఫీ చెప్పెసినట్టు వున్నాను.. అయ్యో పరిస్థితులు అలా వున్నాయి మరి.. ఏం చేస్తాం!!!